Monday 30 May, 2011

చంద్రబా(బో)గోపాఖ్యానం

బాబు మారితే భవిష్యత్తు అయనదేనట!
-ఓ పత్రికాధిపతి మొదటి రోజు సందేశం
మారిన బాబు
-అదే పత్రికలో మూడోరోజు సందేశం
మహానాడు ముగిసే నాటికి పార్టీ శ్రేణులు ఉత్తేజం, ఉత్సాహాలతో తొణికిసలాడి పోయాయని ఆ పత్రిక పులకరించిపోయింది.
-----
కానీ
పత్రికలు రంగులు వేస్తే మేకవన్నెపులి
నిజమైన పులి అవుతుందా?
వందసార్లు చెప్పినా
అసత్యం సత్యమవుతుందా?
గొంతులో నుంచి వచ్చే గాండ్రింపులు
అవేశ ప్రకటనలవుతాయా?
ఫ్రస్ట్రేషన్ ఎమోషన్ అవుతుందా?
నటన జీవితమవుతుందా?
బాబు మారతాడా?
ఒక పార్టీకి ఒక జెండా, ఒక ఎజెండా
లేనప్పుడు ఆ జెండా ఉంటే ఏమి పోతే ఏమి?
మునుగుతున్న నావకు
యాంకర్ వేసినా ప్రయోజనం ఉండదు!
కుంగిపోతున్న సౌధాన్ని
జాకీలు పెట్టి నిలబెట్టడం అసాధ్యం!
పోతపోసిన దివాలాకోరుతనానికి
నిలువెత్తు నిదర్శనం బాబు
సీమాంధ్రుల వంచనాశిల్పానికి
విభజించు పాలించు నైజానికి
ప్రత్యక్షరూపం బాబు!
మాటమీద నిలబడని నాయకుడు
నాయకుడూ కాదు, అది పార్టీ కాదు!
తెలంగాణపై తన నిర్ణయం చెప్పడట
కానీ కేంద్రం నిర్ణయం తీసుకుంటే మాత్రం
అందరినీ మెప్పించేట్టు ఉండాలట!
ఒక ఎజెండాపై తన పార్టీలోనే అందరినీ
మెప్పించలేని అసమర్థ నాయకుడు
మెప్పించడం గురించి మాట్లాడుతున్నాడంటే
దానర్థం ఏమిటి?
‘తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే’
వ్యతిరేకిస్తానని చెప్పడమే కాదా?
తెలంగాణ తెలుగుదేశం నాయకులారా?
మీ నాయకుని సందేశం ఇప్పటికయినా అర్థమవుతుందా?

-కట్టా శేఖర్‌రెడ్డి

2 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Rangacharyulu said...

గాండ్రింపు కాధు, ఓండ్ర అంటె బాగుంటుందని సూచన

Post a Comment